Breaking News

పోకో నుంచి ‘బిగ్‌’ ఫోన్‌


Published on: 09 Dec 2025 17:43  IST

చైనాకు చెందిన షావోమీ సబ్‌బ్రాండ్‌ పోకో తన సీ సిరీస్‌లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. సీ85 5జీ పేరిట కొత్త ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 15తో కూడిన హైపర్‌ ఓఎస్‌ 2.2తో వస్తోంది. 6.9 అంగుళాల ఫ్లాట్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇచ్చారు. 120Hz రిఫ్రెష్‌ రేటు ఉంది.ఈ ఫోన్‌ మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తుంది. 4జీబీ+128జీబీ వేరియంట్‌ రూ.12,499, 6జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ.13,499, 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.14,999గా కంపెనీ నిర్ణయించింది.

Follow us on , &

ఇవీ చదవండి