Breaking News

కోర్టులో లొంగిపోయిన పిన్నెల్లి బ్రదర్స్


Published on: 11 Dec 2025 12:20  IST

మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతడి సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి మాచర్ల కోర్టులో లొంగిపోయారు.వెల్దుర్తి మండలం గుండ్లపాడు జంట హత్యల కేసులో A6 పిన్నెల్లి రామకృష్ణారెడ్డి,A7 పిన్నెల్లి వెంకటరామిరెడ్డి నిందితులన్న  విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి రెండువారాల్లో లొంగిపోవాలంటూ  పిన్నెల్లి సోదరులకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నేటితో సుప్రీం కోర్టు గడువు ముగియడంతో ఈరోజు (గురువారం) ఉదయం మాచర్ల జూనియర్ సివిల్ కోర్టులో పిన్నెల్లి సోదరులు లొంగిపోయారు.

Follow us on , &

ఇవీ చదవండి