Breaking News

అనంతపురంలో దారుణం..


Published on: 11 Dec 2025 14:23  IST

కేఎస్ఆర్ జూనియర్ కళాశాలలో తాడిపత్రి మండలానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు చదువుతున్నారు.విద్యార్థినుల గురించి తల్లిదండ్రులకు వార్డెన్ వసంత ఫిర్యాదు చేశారు. దీంతో విద్యార్థినులు భయపడి ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం గమనించిన వార్డెన్ వెంటనే వారిని చికిత్స నిమిత్తం అనంతపురం సర్వజన ఆస్పత్రికి తరలించారు. ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ప్రస్తుతం బాలికల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Follow us on , &

ఇవీ చదవండి