Breaking News

తెలంగాణలో మరో అగ్నిప్రమాదం..


Published on: 11 Dec 2025 14:28  IST

రహమత్‌నగర్ ఎస్పీఆర్హిల్స్ గ్రౌండ్‌లో ఇవాళ(గురువారం)అగ్నిప్రమాదం జరిగింది.ఈ మంటల్లో మూడు కార్లు, ఒక ఆటో దగ్ధమయ్యాయి.వీటితో పాటు సమీపంలో పార్కింగ్ చేసిన వాహనాలకు మంటలు అంటుకున్నాయి. అగ్నిప్రమాదం ధాటికి మంటలు ఎగసి పడుతున్నాయి. స్థానికులు ఈ ఘటనతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి