Breaking News

ఆవుకు ఎక్స్‌రే తీయగా..కడుపులో కిలోల కొద్ది


Published on: 11 Dec 2025 14:50  IST

కృష్ణాజిల్లా మచిలీపట్నంలో రోడ్లపై తిరిగే పశువుల సమస్య మరో కొత్త మలుపు తీసుకుంది. ఓ ఆవు తీవ్ర అస్వస్థతతో కనిపించడంతో వెటర్నరీ శాఖ అధికారుల దృష్టికి వెళ్ళింది. డాక్టర్ పర్యవేక్షణలో వెటర్నరీ వైద్యులు దీపక్, హేమంత్ బృందం ఆవుకు అత్యవసర చికిత్స నిర్వహించారు. మూడు గంటల పాటు సాగిన ఆపరేషన్‌లో ఆవు కడుపులో పేరుకుపోయిన 52 కిలోల ప్లాస్టిక్, భారీ చెత్త వ్యర్ధాలు బయటకు తీసి ప్రాణాలు కాపాడారు. ప్రస్తుతం ఆవు ఆరోగ్యం నెమ్మదిగా మెరుగుపడుతోంది.

Follow us on , &

ఇవీ చదవండి