Breaking News

హైదరాబాద్‌లో కాలనీలకు బస్సులే బస్సులు


Published on: 11 Dec 2025 16:32  IST

నగరంలో వేగంగా విస్తరిస్తున్న కొత్త కాలనీల వాసులకు మెరుగైన ప్రజా రవాణా సదుపాయాలు అందించేందుకు ఆర్టీసీ కార్యాచరణ రూపొందించింది. ‘హైదరాబాద్‌ కనెక్ట్‌’ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా 373 కొత్త కాలనీలకు బస్సు సౌకర్యం కల్పించనున్నట్టు వెల్లడించింది. క్షేత్రస్థాయిలో పర్యటించిన అధికారులు ప్రజా రవాణా అవసరం ఉన్న కాలనీలను గుర్తించారు. 2 నెలల్లో అత్యధిక రద్దీ ఉన్న కాలనీల్లో మొదటిదశ సేవలు అందుబాటులోకి రానున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి