Breaking News

మిలియన్‌ డాలర్లకే ‘గోల్డ్‌ కార్డు’..


Published on: 11 Dec 2025 17:15  IST

అమెరికా పౌరసత్వం కావాలని కోరుకునే సంపన్నులకు అధ్యక్షుడు ట్రంప్‌ ‘గోల్డ్‌ కార్డు (Gold Card)’ను ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా దీని విక్రయాలను ట్రంప్‌ (Donald Trump) ప్రారంభించారు. 1 మిలియన్‌ డాలర్లు చెల్లించి అగ్రరాజ్యంలో నివాసం పొందే అవకాశం పొందవచ్చు. వైట్‌హౌస్‌లోని కొందరు వ్యాపారవేత్తలతో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ట్రంప్‌ దీన్ని ప్రారంభించారు. ఈ గోల్డ్‌ కార్డు కోసం ప్రత్యేకంగా ఓ వెబ్‌సైట్‌ను ఏర్పాటుచేశారు.

Follow us on , &

ఇవీ చదవండి