Breaking News

లోయలో పడ్డ ట్రక్కు..21 మంది కార్మికులు మృతి


Published on: 11 Dec 2025 17:44  IST

అరుణాచల్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇండో - చైనా సరిహద్దు వెంబడి ఉన్న హుయులియాంగ్ - చగ్లగామ్ రహదారిపై ఈ ఘటన జరిగింది. అస్సోంలోని టిన్సుకియా జిల్లాకు చెందిన రోజు వారి కూలీలను తీసుకువెళ్తున్న ఓ ట్రక్కు మార్గమధ్యలో ఈ ప్రమాదానికి గురైనట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ట్రక్కులో ఉన్న 21 మంది కూలీలు చనిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు.ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు మిలో కొజిన్ వెల్లడించారు.

Follow us on , &

ఇవీ చదవండి