Breaking News

కేంద్ర మాజీ మంత్రి శివరాజ్‌ పాటిల్‌ కన్నుమూత


Published on: 12 Dec 2025 10:53  IST

కేంద్ర మాజీ మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన 90 ఏళ్ల వయసులో శుక్రవారం ఉదయం కన్నుమూశారు. మహారాష్ట్ర లాతూర్‌లోని నివాసంలో శివరాజ్ పాటిల్ చనిపోయారు. ఆయన లాతూర్ నుంచి ఏడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2004 నుంచి 2008 వరకు కేంద్ర మంత్రిగా పని చేశారు. 1991 నుంచి 1996 వరకు 10వ లోక్ సభ స్పీకర్‌గా పని చేశారు. పంజాబ్ గవర్నర్‌గా కూడా పని చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి