Breaking News

బ్లూబర్డ్‌ ప్రయోగం 21కి వాయిదా..


Published on: 12 Dec 2025 11:47  IST

ఇస్రో చేపట్టనున్న వాణిజ్య ఉపగ్రహ ప్రయోగం ‘బ్లూబర్డ్‌’ వాయిదా పడినట్టు తెలిసింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం షార్‌ నుంచి ఎల్వీఎం3-ఎం6 రాకెట్‌ ప్రయోగం ద్వారా బ్లూబర్డ్‌ ఉపగ్రహాన్ని తొలుత ఈనెల 17న ప్రయోగించనున్నట్లు ఇస్రో వర్గాలు తెలిపాయి. కానీ.. రాకెట్‌ అనుసంధానం ఆలస్యం కావడంతో ఈ ప్రయోగం ఈ నెల 21కి వాయిదా పడినట్లు ఇస్రో వర్గాల సమాచారం. షార్‌లోని రెండో వెహికల్‌ అసెంబ్లింగ్‌ బిల్డింగ్‌లో రాకెట్‌ అనుసంధాన పనులు జరుగుతున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి