Breaking News

ఆటో బోల్తాపడి ముగ్గురి మృతి.. పలువురికి గాయాలు


Published on: 12 Dec 2025 16:30  IST

కొల్లూరు మండలం దోనేపూడి - వెల్లటూరు రహదారిపై అతి వేగంతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి