Breaking News

రైతు అంటే ఇదీ..పక్షుల కోసం పండించిన ధాన్యం..


Published on: 12 Dec 2025 17:00  IST

తణుకు రూరల్ మండలం వేల్పూరు గ్రామంలో రైతులు వినాయకుని గుడి వద్ద సార్వా పంటకు సంబంధించిన వరి పనలను సేకరించి వాటిని శుభ్రం చేసి జడలుగా అల్లుతున్నారు. జడలను కుచ్చులుగా తయారు చేసి వాటిని దేవాలయాల వద్ద పిచ్చుకలు వచ్చి తినేలా వేలాడదీస్తున్నారు. ఈ వారికుచ్చులు రైతు చెమటకు చిహ్నం మాత్రమే కాదు మన సంస్కృతిలో ఒక భాగం. ఇంటికి శుభం చేకూర్చే కార్యక్రమం, మరోవైపు భూమాతకు కర్షకుడు ఇచ్చే గౌరవమని రైతులు చెబుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి