Breaking News

వైసీపీ బైక్ ర్యాలీ.. రెండు వర్గాల మధ్య ఘర్షణ..


Published on: 15 Dec 2025 16:55  IST

రాష్ట్రంలో వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అనంతపురంలో వైసీపీ నేతలు బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ బైక్ ర్యాలీలో ఒక వర్గం వారు ముందుకు వెళ్లాంటే.. మరో వర్గం వారు ముందుకు వెళ్లాలంటూ ప్రయత్నించడంతో ఈ ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఒకరికి గాయాలయ్యాయి. పోలీసులు జోక్యం చేసుకుని.. ఈ ఘర్షణలో గాయపడిన వ్యక్తిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఇరు వర్గాల వారికి పోలీసులు సర్ది చెప్పారు.

Follow us on , &

ఇవీ చదవండి