Breaking News

మెక్సికోలో కూలిన విమానం.. ఏడుగురు మృతి


Published on: 16 Dec 2025 15:14  IST

మెక్సికోనగరానికి సమీపంలో చిన్న ప్రైవేట్ విమానం కూలిపోవడంతో ఈఘటన జరిగిందని అధికారులు తెలిపారు.మెక్సికో తీరం వెంబడి ఉన్న అకాపుల్కో నుంచి 8 మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బందితో ఫ్లైట్ బయల్దేరింది. సాకర్ మైదానంలో ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించే క్రమంలో సమీపంలోని ఓ వ్యాపార సంస్థ మెటల్ పైకప్పును ఢీకొట్టింది. దీంతో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. అయితే.. ప్రమాదం అనంతరం 7 మృతదేహాలను మాత్రమే గుర్తించారు అధికారులు. మిగిలిన ముగ్గురి ఆచూకీ తెలియాల్సి ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి