Breaking News

600 బిలియన్ డాల‌ర్ల సంప‌ద‌ క‌లిగిన తొలి వ్యక్తి..!


Published on: 16 Dec 2025 15:29  IST

అమెరికన్‌ టైకూన్‌, ప్రపంచ కుబేరుడు, టెస్లా బాస్‌ ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) సరికొత్త రికార్డును నెలకొల్పారు. వ్యక్తిగత సందప పరంగా మస్క్‌ ఏకంగా 600 బిలియన్‌ డాలర్ల క్లబ్‌లోకి చేరారు. తద్వారా ప్రపంచంలోనే తొలిసారి ఈ రికార్డు నెలకొల్పిన వ్యక్తిగా మస్క్‌ చరిత్ర సృష్టించారు. మస్క్ స్థాపించిన అంతరిక్ష సంస్థ స్పేస్‌ఎక్స్ విలువ 800 బిలియన్ డాలర్లకు చేరుకుని, ఐపీఓగా వచ్చే అవకాశం ఉందనే వార్తల నేపథ్యంలో ఆయన సంపద ఈ స్థాయికి పెరగడం విశేషం.

Follow us on , &

ఇవీ చదవండి