Breaking News

ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్‌కౌంటర్..


Published on: 18 Dec 2025 11:08  IST

ఛత్తీస్‌గఢ్‌లో నేడు మరో ఎన్‌కౌంటర్ జరిగింది. సుక్మా జిల్లా గొల్లపల్లి అటవీ ప్రాంతం పరిధిలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్‌కు, మావోయిస్టులకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్టు సమాచారం. అయితే, మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది నేడు ఉదయం నుంచే ఆ ప్రాంతంలో అప్పుడప్పుడూ కాల్పులు శబ్దాలు వినిపించాయి. దీంతో,అధికారులు హైఅలర్ట్‌లో ఉన్నారు. ఇక తాజా ఎన్‌కౌంటర్‌ తరువాత పోలీసులు ఆ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి