Breaking News

ఎకనామిక్ టైమ్స్ అవార్డుపై సీఎం రియాక్షన్


Published on: 18 Dec 2025 15:05  IST

ప్రతిష్టాత్మకమైన ‘బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును (CM Chandrababu Naidu) ప్రముఖ దినపత్రిక ఎకనామిక్ టైమ్స్ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ అవార్డుపై కలెక్టర్ల సదస్సులో సీఎం స్పందించారు. ఈ తరహా అవార్డులు ఎప్పుడూ తాను తీసుకోలేదని.. విదేశీ యూనివర్సిటీలు డాక్టరేట్ ఇస్తామన్నా సున్నితంగా తిరస్కరించినట్లు చెప్పారు. ఈ అవార్డు రావటం వెనుక క్రెడిట్ అంతా తన సహచరులు, అధికారులు, కలెక్టర్లదే అని తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి