Breaking News

మరో 2 రోజుల్లో తెలంగాణ సెట్‌ 2025 పరీక్షలు..


Published on: 19 Dec 2025 12:23  IST

తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ 2025 ఆన్‌లైన్‌ రాత పరీక్షలు డిసెంబర్‌ 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులు తాజాగా విడుదలయ్యాయి. ఈమేరకు హాల్‌టికెట్స్‌ను అధికారులు అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్‌ నంబర్‌, మొబైల్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి అధికారిక వెబ్‌సైట్‌ నుంచి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.సెట్‌ పరీక్షలో అర్హత సాధించిన వారికి లెక్చరర్ల ఉద్యోగాలకు అర్హత లభిస్తుంది.

Follow us on , &

ఇవీ చదవండి