Breaking News

బీజాపూర్ జిల్లాలో ఎన్ కౌంటర్..


Published on: 19 Dec 2025 14:10  IST

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య చోటుచేసుకుంటున్న ఎన్‌ కౌంటర్లలో పెద్ద ఎత్తున మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. శుక్రవారం బీజాపూర్ జిల్లాలో డీఆర్‌జీ జవాన్లకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఓ మావోయిస్టు ప్రాణాలు కోల్పోయాడు. సంఘటనా స్థలం నుంచి భద్రతా దళాలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి