Breaking News

ప్రభుత్వ పనులకు తక్కువ ధరకే సిమెంట్‌


Published on: 23 Dec 2025 11:44  IST

ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన పనులకు తక్కువ ధరకే సిమెంట్‌ను సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జీఎస్టీ కౌన్సిల్‌ సిమెంటుపై పన్ను రేటును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడంతో ఆ మేరకు ధరలను సవరించింది. ఏపీ ట్రేడ్‌ ప్రమోషన్‌ కార్పొరేషన్‌ను నోడల్‌ ఏజెన్సీగా నియమించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆన్‌లైన్‌ సిమెంట్‌ ప్రొక్యూర్‌మెంట్‌ పోర్టల్‌(ఏపీ నిర్మాణ్‌) ద్వారా సిమెంట్‌ సేకరణకు మార్గదర్శకాలు జారీ చేసింది. 

Follow us on , &

ఇవీ చదవండి