Breaking News

ఎలక్ట్రానిక్ పరిశ్రమలకు భారీ ప్రోత్సాహకాలు


Published on: 23 Dec 2025 12:09  IST

ఎలక్ట్రానిక్ వస్తువులను తయారు చేసే పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ పాలసీ 2025-30ను ఐటీశాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్‌ సోమవారం విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే ఈ పాలసీకి సంబంధించిన మార్గదర్శకాలను ఈ ఏడాది ఏప్రిల్‌ 26న ఐటీశాఖ విడుదల చేసింది. ఎర్లీబర్డ్‌ పథకం కింద రాష్ట్రంలో రూ.250 కోట్ల పెట్టుబడి పెట్టిన తొలి పది కంపెనీలకు 50 శాతం పెట్టుబడి రాయితీని రెండు వాయిదాల్లో ఇస్తారు.

Follow us on , &

ఇవీ చదవండి