Breaking News

కన్నతండ్రి ఘాతుకం..


Published on: 23 Dec 2025 16:36  IST

ఓ తండ్రి తన ఇద్దరు కుమార్తెలను కాలువలోకి తోసేసిన ఘటన అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం నేమకల్లులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నేమకల్లు గ్రామానికి చెందిన కల్లప్ప అనే వ్యక్తి మొదటగా పెద్ద అమ్మాయిని కాలువలోకి తోసేశాడు. చిన్న కుమార్తె అక్కడినుంచి పరుగెత్తడంతో మళ్లీ పట్టుకుని వచ్చి తోసేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.బాలికల ఆచూకీపై పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో పెద్దకుమార్తె అనసూయ మృతదేహాన్ని కాలువలో గుర్తించి బయటకు తీశారు.

Follow us on , &

ఇవీ చదవండి