Breaking News

పీవీ వర్ధంతి సందర్భంగా కేటీఆర్ నివాళులు


Published on: 23 Dec 2025 18:51  IST

తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహా రావు భారతదేశానికి గర్వకారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. భారత ప్రధానిగా, ఆర్థికవేత్తగా, రాజనీతిజ్ఞుడిగా, సంస్కరణశీలిగా, బహుభాషా కోవిదుడిగా భారతరత్న పీవీ అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా ఆయన ట్విట్టర్ (ఎక్స్) వేదికగా నివాళులర్పించారు.ఆధునిక భారత నిర్మాణానికి బాటలు వేస్తూ.. పీవీ నరసింహా రావు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు చరిత్రాత్మకమని కేటీఆర్ అన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి