Breaking News

బంగ్లాదేశ్‌లో మూకదాడిపై భారత్‌లో ఆగ్రహ జ్వాల


Published on: 24 Dec 2025 10:18  IST

మంగళవారం ఉదయం ఢిల్లీలోని బంగ్లాదేశ్‌ రాయబార కార్యాలయం వద్ద వీహెచ్‌పీ, బజ్‌రంగ్‌దళ్‌ తదితర సంస్థలు భారీ ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించాయి. వందలాది మంది కాషాయ జెండాలు చేతబూని, ప్లకార్డులు ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూ పాల్గొన్నారు. అనేక మంది బంగ్లాదేశీయులు అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించి, ఢిల్లీలో ఉంటున్నారని, వారిలో ఒక్కరిపైనా దాడి జరగలేదని, కానీ, బంగ్లాదేశ్‌లో మాత్రం హిందువులపై మూకదాడులు జరుగుతున్నాయని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి