Breaking News

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. వారికి ఆస్తి పన్ను రద్దు


Published on: 12 May 2025 09:13  IST

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ శాఖ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. గ్రామ పంచాయతీ పరిధిలో భారత రక్షణ దళాలకు చెందిన సిబ్బంది నివాస గృహాలకు ఆస్తి పన్ను మినహాయింపు కల్పించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. సైనికుల వీరోచిత సేవలను గౌరవిస్తూ, వారి కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గించే ఉద్దేశంతో ఈ చర్య తీసుకున్నారు. సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ సిఫార్సు మేరకు, ఈ నిర్ణయం తీసుకున్నట్టు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. 

Follow us on , &

ఇవీ చదవండి