Breaking News

16 నుంచి ఐపీఎల్‌...?


Published on: 12 May 2025 09:51  IST

భారత్, పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతల కారణంగా సస్పెండైన ఐపీఎల్‌ ఈ నెల 16 లేదా 17వ తేదీన ఆరంభమయ్యే అవకాశముంది. కాల్పుల విరమణ ప్రకటనతో ఐపీఎల్‌కు మార్గం సుగమం అయిన సంగతి తెలిసిందే. అయితే టోర్నీ తిరిగి ప్రారంభం కావడం అన్నది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంది. టోర్నీ పునరుద్ధరణ గురించి ఐపీఎల్‌ పాలకవర్గ సభ్యులు, బీసీసీఐ అధికారులు ఆదివారం చర్చించారు. బీసీసీఐ ఇంకా షెడ్యూలును సిద్ధం చేసే పనిలో ఉందని బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా చెప్పారు.

Follow us on , &

ఇవీ చదవండి