Breaking News

భారత్‌, పాక్‌ చర్చలు వాయిదా.. మోదీ-డోభాల్‌ ప్రత్యేక భేటీ


Published on: 12 May 2025 14:43  IST

భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య ప్రస్తుతం కాల్పుల విరమణ కొనసాగుతోంది. ఈ ఒప్పందం, అనంతర పరిస్థితిపై ఇరుదేశాల మధ్య సోమవారం మధ్యాహ్నం కీలక చర్చలు జరగాల్సి ఉండగా.. ప్రస్తుతం అవి వాయిదా పడ్డాయి. ఈ సాయంత్రం 5 గంటలకు ఈ చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రెండు దేశాల ‘సైనిక కార్యకలాపాల డైరెక్టర్‌ జనరల్‌’ (డీజీఎంవో)ల మధ్య హాట్‌లైన్‌లో చర్చలు జరుగుతాయి.  అయితే, వాయిదాకు గల కారణాలు తెలియరాలేదు.

Follow us on , &

ఇవీ చదవండి