Breaking News

పాక్‌ మిరాజ్‌ యుద్ధ విమానాన్ని కూల్చేసిన ఇండియన్‌ ఆర్మీ..


Published on: 12 May 2025 17:07  IST

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ ‘ఆపరేషన్‌ సిందూర్‌’ను విజయవంతంగా చేపట్టిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియోను భారత ఆర్మీ తాజాగా విడుదల చేసింది. పాకిస్థాన్‌కు చెందిన మిరాజ్‌ యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు ఈ వీడియో ద్వారా భారత్‌ స్పష్టం చేసింది. ‘గగనతలంలో శత్రువును ధ్వంసం చెయ్‌’ అన్న క్యాప్షన్‌తో వీడియోను పంచుకుంది. ఈ వీడియోలో పాక్‌ మిరాజ్ శిథిలాలను కూడా చూపింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది.

Follow us on , &

ఇవీ చదవండి