Breaking News

బుర్కినా ఫాసోలో మారణహోమం..100 మందికి పైగా మృతి


Published on: 13 May 2025 11:54  IST

పశ్చిమ ఆఫ్రికా దేశమైన బుర్కినా ఫాసోలో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఉగ్రవాదులు సృష్టించిన నరమేధంలో 100మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. స్థానిక అధికారుల సమాచారం మేరకు.. బుర్కినా ఫాసోలో ఆదివారం తెల్లవారుజామున ఈ దాడి జరిగింది. ఉత్తర బుర్కినా ఫాసోలో ఉగ్రవాదులు పలు ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి పాల్పడ్డారు. ఇందులో సైనిక స్థావరంతో పాటు డజిబో పట్టణం సైతం ఉంది. యాక్టివ్‌గా ఉన్న అల్ ఖైదా అనుబంధ గ్రూప్ జేఎన్‌ఐఎమ్ ఈ దాడికి పాల్పడింది.

Follow us on , &

ఇవీ చదవండి