Breaking News

అత్యంత కలుషిత నగరాల్లో ఢిల్లీకి ఐదోస్థానం..


Published on: 13 May 2025 14:30  IST

ఏప్రిల్‌ మాసంలో దేశంలోని అత్యంత కాలుష్య నగరాల జాబితాలో ఢిల్లీ ఐదో స్థానంలో నిలిచింది. వేసవిలోనూ ఢిల్లీ ప్రజలకు స్వచ్ఛమైన గాలి అందడం లేదని స్పష్టమవుతున్నది. వేసవిలోనే ఈ పరిస్థితి ఇలా ఉంటే శీతాకాలంలో మరెలా ఉంటుందనేదానికి అద్దం పడుతున్నది. అదే సమయంలో 80శాతం రోజుల్లో కాలుష్యం సాధారణ స్థాయిలోనే ఉంది. సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ (CREA) ఇటీవలి నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది.

Follow us on , &

ఇవీ చదవండి