Breaking News

ఎయిర్‌ ఇండియా విమాన సమయం మార్పు


Published on: 22 Jan 2026 16:43  IST

ఢిల్లీ నుంచి హైదరాబాదు మీదుగా తిరుపతి(Tirupati)కి వచ్చే ఎయిర్‌ ఇండియా విమాన సర్వీసు సమయాన్ని మార్చారు. ఇప్పటి వరకు మధ్యాహ్నం 2.10 గంటల కు రేణిగుంటకు వచ్చే ఈ విమానం 3.10గంటలకు ఢిల్లీ(Delhi)కి బయలుదేరి వెళ్లేది. బుధవారం నుంచి మధ్యాహ్నం 1.45గంటలకు రేణిగుంట(Renigunta)కు చేరుకుని, 2.10గంటలకు ఢిల్లీకి బయలుదేరి వెళుతుంది.అలాగే ముంబై నుంచి 5.20గంటలకు వచ్చి 6.10గంటలకు వెళ్లాల్సిన ఇండిగో విమానం 40 నిమిషాలు ఆలస్యంగా నడిచింది.

Follow us on , &

ఇవీ చదవండి