Breaking News

2 గంటలు ఆలస్యంగా EAPCET పరీక్ష


Published on: 26 May 2025 16:28  IST

ఏపీలో ఇంజినీరింగ్, ఫార్మసీ, వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏపీ ఈఏపీసెట్‌ పరీక్ష సోమవారం జరుగుతోంది. అయితే తిరుపతిలో 2 గంటలు ఆలస్యంగా పరీక్ష ప్రారంభమైంది. పుత్తూరు ఎస్‌విపిసెట్ కళాశాలలో 9 గంటలకు ప్రారంభం కావాల్సిన పరీక్ష సర్వర్ సమస్యతో 11 గంటలకు ప్రారంభమైంది. నెట్‌వర్క్ సమస్య తో పరీక్షలు ప్రారంభం ఆలస్యమయ్యాయని టెక్నీషియన్స్ వెల్లడించారు. ఆన్‌లైన్ ద్వారా కంప్యూటర్ బేస్డ్ పరీక్ష ప్రారంభమైనప్పటి నుంచి 3 గంటలు పరీక్ష ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి