Breaking News

పాక్‌ ఓటీటీ కంటెంట్‌పై భారత ప్రభుత్వం కీలక నిర్ణయం


Published on: 08 May 2025 18:35  IST

‘ఆపరేషన్‌ సిందూర్‌’ ఇంకా కొనసాగుతోందని, కేంద్ర రక్షణాశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ తాజాగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘జాతీయ భద్రత దృష్ట్యా పాకిస్థాన్‌కు సంబంధించిన ఓటీటీ కంటెంట్‌, ఓటీటీ వేదికలు, మీడియా స్ట్రీమింగ్‌ ఫ్లాట్‌ఫాంలు, మధ్యవర్తిత్వం ద్వారా అయ్యే ఏ ప్రసారమైనా ఇక పూర్తిగా నిలిపివేస్తున్నాం.  పాకిస్థాన్‌కు చెందిన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు, పాటలు, పాడ్‌కాస్ట్‌లు సహా మీడియా కంటెంట్‌ ఏదీ ఇక భారత్‌లో అందుబాటులో ఉండదు అని భారత సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ నిర్ణయించింది.

Follow us on , &

ఇవీ చదవండి