Breaking News

నవంబర్ 2 నుంచి చంద్రబాబు లండన్ పర్యటన.


Published on: 16 Oct 2025 14:24  IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నవంబర్ 2 నుంచి 5వ తేదీ వరకు లండన్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటన ప్రధానంగా రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంపై దృష్టి సారించింది. విశాఖపట్నంలో నవంబర్ 14, 15 తేదీల్లో జరగనున్న భాగస్వామ్య సదస్సు (పార్టనర్‌షిప్ సమ్మిట్)కు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించడం, రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలను వివరించడం.

ఆయన లండన్‌లోని వివిధ పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు.ముఖ్యమంత్రితో పాటు, సీనియర్ ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రాతోపాటు మరికొందరు అధికారులు ఈ బృందంలో ఉంటారు.పర్యటనకు సంబంధించిన ఆదేశాలను సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేశ్ కుమార్ మీనా జారీ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి