Breaking News

ఏడుగురు మహిళలను 14 మంది యువకులను అరెస్టు చేసిన పోలీసులు.

మొయినాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఏతబర్‌పల్లి శివారులో ఉన్న ఓ హాలిడే ఫార్మ్‌హౌస్‌లో పుట్టినరోజు వేడుకల పేరిట ముజ్రా పార్టీ, ముంబయి, మహారాష్ట్ర, బెంగాల్‌ సహా ఇతర రాష్ట్రాల నుంచి మహిళల తీసుకొచ్చినట్లు గుర్తించారు.


Published on: 09 Apr 2025 16:52  IST

హైదరాబాద్: మొయినాబాద్‌లోని ఓ ఫార్మ్‌హౌస్‌లో జరుగుతున్న అనుమానాస్పద పార్టీపై పోలీసులు అకస్మాత్తుగా దాడి చేసి, అదుపులోకి తీసుకున్నారు. బుధవారం తెల్లవారుజామున సైబరాబాద్‌ స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్ (SOT) తో కలిసి పోలీసులు ఈ ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడుగురు మహిళలు, 14 మందిని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మొయినాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఏతబర్‌పల్లి శివారులో ఉన్న ఓ హాలిడే ఫార్మ్‌హౌస్‌లో పుట్టినరోజు వేడుకల పేరిట ముజ్రా పార్టీ నిర్వహించినట్లు వెల్లడైంది. ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా ముంబయి, మహారాష్ట్ర, బెంగాల్‌ సహా ఇతర రాష్ట్రాల నుంచి మహిళలను అక్కడికి తీసుకొచ్చినట్లు గుర్తించారు.

పార్టీ జరుగుతున్న ప్రదేశంలో 70 గ్రాముల గంజాయి, మద్యం సీసాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మహిళలను రక్షణ కేంద్రానికి తరలించగా, మిగతా వ్యక్తులను విచారణ కోసం పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి