Breaking News

పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని కొండరెడ్డి గిరిజన గ్రామాల్లో మామిడికాయ పండుగ ఉత్సాహంగా కొనసాగుతోంది.

వనదేవతలకు పూజలు చేసిన అనంతరం పిల్లలు, పెద్దలు అందరూ కలిసి డోలు వాయిద్యాల మధ్య ఆనందంగా నృత్యాలు చేస్తూ సంబరాల్లో మునిగితేలుతున్నారు.


Published on: 02 Apr 2025 23:23  IST

బుట్టాయగూడెం: పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని కొండరెడ్డి గిరిజన గ్రామాల్లో మామిడికాయ పండుగ ఉత్సాహంగా కొనసాగుతోంది. గత రెండు రోజులుగా గిరిజనులు తమ సంప్రదాయాలను పాటిస్తూ ఈ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. వనదేవతలకు పూజలు చేసిన అనంతరం పిల్లలు, పెద్దలు అందరూ కలిసి డోలు వాయిద్యాల మధ్య ఆనందంగా నృత్యాలు చేస్తూ సంబరాల్లో మునిగితేలుతున్నారు.

తమ పూర్వీకుల కాలం నుంచి వస్తున్న మామిడికాయ పండుగతో పాటు బాట పండుగ, పప్పుల పండుగలను కూడా ప్రభుత్వం గుర్తించాలని కొండరెడ్డి గిరిజనులు కోరుతున్నారు. ప్రతి ఏడాది వేసవికాలంలో జరిగే ఈ పండుగను నిర్వహించేందుకు గ్రామస్తులు సుమారు రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం గ్రామ ప్రజలు చందాలు వేసుకోవడంతో పాటు కొంత సొమ్మును వసూలు చేసి పండుగను నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ ఆదరణ లేకుండా తాము పండుగను కొనసాగించడం కష్టంగా మారుతుందని, తమ పంటలను గుర్తించి ఐటీడీఏ ద్వారా ఆర్థిక సహాయం అందించాలని కొండరెడ్డి గిరిజనులు కోరుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి