Breaking News

వైద్య శాఖ చరిత్రలోనే భారీ సంఖ్యలో స్పెషలిస్ట్ డాక్టర్స్ భర్తీకి నోటిఫికేషన్

తెలంగాణ నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ తీపి కబురు అందించింది. వైద్య శాఖలో భారీగా 1623 పోస్టుల భర్తీకి సిద్ధమైంది. త్వరలోనే దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈభర్తీ ప్రక్రియలో స్పెషలిస్ట్ డాక్టర్ల నియామకాన్ని పూర్తి చేయనుంది. వైద్య శాఖలో ఉద్యోగాల భర్తీ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలను అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది.


Published on: 22 Aug 2025 10:25  IST

తెలంగాణలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. త్వరలోనే 1,623 పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన వారిలో నిరుద్యోగులు ముందు వరుసలో ఉంటారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో లోపాలు, పేపర్ లీకేజీ వంటి ఘటనలు నిరుద్యోగుల్లో తీవ్ర ఆగ్రహాన్ని మిగిల్చాయి. ఈక్రమంలో వారు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతిచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ సర్కార్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో జాప్యం చేస్తూ వస్తోంది. దీనిపై నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల లోపు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈక్రమంలో తాజాగా రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఆ శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీకి సిద్ధమవుతోంది. ఆ వివరాలు.

తెలంగాణ సర్కార్ వైద్య శాఖలో ఉద్యోగాల భర్తీకి రెడీ అవుతోంది. ఇప్పటికే వైద్య శాఖలో వివిధ విభాగాల్లో భారీ ఎత్తున ఉద్యోగాలను భర్తీ చేసి గ్రామీణ వైద్యానికి పెద్ద పీట వేస్తోన్న రేవంత్ సర్కార్.. తాజాగా మరో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. ఈ క్రమంలో వైద్య చరిత్రలోనే భారీ సంఖ్యలో స్పెషలిస్ట్ వైద్యుల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం రెడీ అవుతోంది. దీనిలో భాగంగా 1,623 స్పెషలిస్ట్ డాక్టర్ల పోస్టులకు నోటిఫికేషన్ సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించి విధివిధానాలు పూర్తి చేసి నోటిఫికేషన్ విడుదల చేయాలని మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డును ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. దీంతో ఒకటి రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల కానుంది అంటున్నారు.
 

Follow us on , &

ఇవీ చదవండి