Breaking News

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంపై కేంద్ర హోంశాఖ సమీక్ష!


Published on: 17 Jun 2025 13:12  IST

అహ్మదాబాద్‌ ఘోర విమాన ప్రమాదంపై తాజాగా కేంద్ర హోం శాఖ సమీక్ష నిర్వహించింది. దాదాపు రెండు గంటల పాటు కేంద్ర హోంశాఖ కార్యదర్శి ప్రమాదంపై చర్చించారు. ప్రధానంగా విమాన ప్రమాదానికి దారితీసే కారణాలపై ఫోకస్‌ చేసినట్లు సమాచారం. గత ప్రమాదాల రికార్డులను ఉన్నత స్థాయి కమిటీ పరిశీలించింది. విమానాల ప్రామాణిక ఆపరేటింగ్‌ విధానాలపై కూడా ఈ సందర్భంగా చర్చించారు. భవిష్యత్‌లో విమాన ప్రమాదాలను నివారించడానికి ప్రామాణిక ఆపరేటింగ్‌ విధానాల రూపకల్పన చేయాలని నిర్ణయించారు.

Follow us on , &

ఇవీ చదవండి