Breaking News

ఈపీఎఫ్‌ఓ గుడ్‌న్యూస్‌..


Published on: 24 Jun 2025 18:14  IST

ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (EPFO) చందాదారులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. ముందస్తు ఉపసంహరణలకు సంబంధించి ఆటో సెటిల్‌మెంట్‌ పరిధిని ఈపీఎఫ్‌ఓ సవరించింది. ప్రస్తుతం రూ.లక్షగా ఉన్న మొత్తాన్ని రూ.5 లక్షలకు పెంచింది. అంటే రూ.5 లక్షల వరకు క్లెయిమ్‌లు త్వరితగతిన సెటిల్‌ కానున్నాయన్నమాట. అత్యవసర సమయాల్లో క్లెయిమ్స్‌ చేసే ఈపీఎఫ్‌ఓ సభ్యులకు దీనివల్ల లబ్ధి చేకూరనుందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ప్రకటించారు.

Follow us on , &

ఇవీ చదవండి