Breaking News

త్యాగాలను తల్చుకుంటూ బీబీ కా ఆలం ఊరేగింపు


Published on: 07 Jul 2025 09:45  IST

హైదరాబాద్ సిటీ, వెలుగు: పాతబస్తీలో బీబీ కా ఆలం ఊరేగింపు ఆదివారం భారీ జన సందోహం మధ్య సాగింది. డబీర్​పుర నుంచి ప్రారంభమైన ఊరేగింపు షేక్ ఫైజ్ కమాన్, అలిజ కోట్లా, చార్మినార్, గుల్జార్ హౌజ్, మీర్ చౌక్, పురానీ హావేలి, దారుల్​ షిఫా, కాలి ఖబర్ మీదుగా చాదర్​ఘాట్​వరకు సాగింది. బీబీ కా ఆలంను అంబారీపై ఊరేగించారు.ఊరేగింపు సందర్భంగా పాతబస్తీలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. 1500 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి