Breaking News

ఈ రాత్రి గంటకి వంద కి.మీ వేగంతో గాలులు!


Published on: 28 Oct 2025 11:54  IST

కృష్ణా జిల్లాలో తుఫాన్ కారణంగా ప్రభావితమయ్యే ప్రాంతాల్లో మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ ఈ ఉదయం పర్యటించారు. మొంథా తుఫాన్ ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోరారు.తుఫాను ఈరోజు రాత్రికి తీరం దాటే అవకాశం ఉండటంతో వంద కిలోమీటర్ల వేగంతో కూడిన గాలులతో భారీ వర్షం కురుస్తుందని అటు, వాతావరణ శాఖ కూడా అప్రమత్తం చేసింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ఇళ్ల నుంచి ఎవరూ బయటికి రావద్దని ప్రభుత్వం హెచ్చరికలు చేస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి