Breaking News

విశాఖలో భారీ వర్షం..


Published on: 28 Oct 2025 14:53  IST

తుపాను ప్రభావంతో విశాఖ జిల్లాలో సోమవారం రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. ఈదురుగాలులకు పలు చోట్ల చెట్లు నేలకూలాయి. జ్ఞానాపురం రైల్వే అండర్‌పాస్‌ బ్రిడ్జి వద్ద వర్షపు నీరు నిలిచింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆనందపురం-అనకాపల్లి జాతీయ రహదారిపై సర్వీసు రోడ్డు నీటమునిగింది. ఆరిలోవ రామకృష్ణాపురం ప్రాంతంలో గెడ్డ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Follow us on , &

ఇవీ చదవండి