Breaking News

అదుపుతప్పి నదిలో పడిపోయిన బీజేపీ ఎమ్మెల్యే..


Published on: 28 Oct 2025 15:35  IST

ఢిల్లీ యమునా నది శుభ్రతపై బీజేపీ, ఆప్ మధ్య మాటల యుద్ధం మధ్య ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. యమునా శుభ్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన బీజేపీ ఎమ్మెల్యే రవీందర్ సింగ్ నేగి రీల్ చిత్రీకరిస్తూ జారిపడి నదిలో పడిపోయారు. ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై ఆప్ నేత సంజీవ్ ఝా వ్యంగ్యంగా స్పందిస్తూ, “బహుశా యమునా మాత అబద్ధ ప్రచారాలతో విసిగి వారిని తన వద్దకు పిలిపించుకుందేమో” అంటూ ఎద్దేవా చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి