Breaking News

రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిపేసిన భారత


Published on: 28 Oct 2025 16:17  IST

ఉక్రెయిన్‌తో యుద్ధం ముగింపు విషయంలో రష్యా తీరుపై ఆగ్రహంగా ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. ఆ దేశ చమురు సంస్థలపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోలుకు భారత రిఫైనరీలు కొత్త ఆర్డర్లు ఇవ్వడం లేదు. తాత్కాలికంగా చమురు కొనుగోలును నిలిపివేశాయి. ఆంక్షలపై మరింత స్పష్టత కోసం వేచిచూసే వైఖరిని అనుసరిస్తున్నాయి. స్పాట్‌ మార్కెట్ల నుంచి కొనుగోళ్లతో ఆ లోటును భర్తీ చేసుకుంటున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి