Breaking News

ఎదురెదురుగా ఆర్టీసీ బస్సులు ఢీ..పది మందికి గాయాలు


Published on: 28 Oct 2025 16:26  IST

చిత్తూరు జిల్లా పుంగనూరు–పలమనేరు మధ్య గూడూరుపల్లి మలుపులో జరిగిన భయానక రోడ్డు ప్రమాదం స్థానికులను కలవరపరిచింది. ఎదురెదురుగా దూసుకొచ్చిన రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొనడంతో పది మంది ప్రయాణికులు గాయపడ్డారు, అందులో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సమాచారం. బస్సుల ముందు భాగాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి