Breaking News

మొంథా తుపాన్ ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో వర్షం


Published on: 28 Oct 2025 17:47  IST

తెలుగు రాష్ట్రాలపై మొంథా తుపాన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. తుపాన్ ప్రభావంతో ఏపీతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, జర్నలిస్ట్ కాలనీ, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్‌పేట్‌‌లో భారీ వర్షం పడింది.లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయిపోయాయి. ట్రాఫిక్‌కు సైతం అంతరాయం ఏర్పడింది.

Follow us on , &

ఇవీ చదవండి