Breaking News

కారును ఢీకొన్న విమానం.. వీడియో వైరల్


Published on: 10 Dec 2025 12:59  IST

అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ భయానక సంఘటన చోటు చేసుకుంది. రోడ్డుపై ప్రయాణిస్తున్న కారును అనూహ్యంగా ఓ విమానం వెనుక నుంచి ఢీ కొట్టింది. సోమవారం రాత్రి బ్రెవర్డ్ కౌంటీ వద్ద ఇంటర్ స్టేట్-95 నేషనల్ హైవేపై హఠాత్తుగా ఓవిమానం నేలపై ల్యాండ్ అయింది.ఈ క్రమంలో అది వేగాన్ని అదుపు చేసుకోలేక ఎదురుగా ప్రయాణిస్తున్న కారును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న మహిళకు గాయాలయ్యాయి. సదరు మహిళ ఓ పెను ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి