Breaking News

బెంగళూరు-విజయవాడ కారిడార్‌ పూర్తికావాలి


Published on: 30 Jan 2026 16:01  IST

రాజధాని అమరావతిని అనుసంధానించే బెంగళూరు-కడప-విజయవాడ ఎకనామిక్‌ కారిడార్‌ పనులు 2027కల్లా పూర్తి కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఖరగ్‌పూర్‌- అమరావతి గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వేకు కూడా త్వరలోనే డీపీఆర్‌ సిద్ధం చేయాలని ఆదేశించారు. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తయితే ప్రజలకు తక్షణం ప్రయోజనం కలుగుతుందన్నారు. గురువారం ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారి ప్రాజెక్టులపై ఆయన సమీక్ష జరిపారు.

Follow us on , &

ఇవీ చదవండి