Breaking News

మేడారం మహాజాతర విజయవంతం: సీతక్క


Published on: 02 Feb 2026 11:03  IST

మేడారం సమక్క - సారక్క అమ్మవార్ల మహాజాతర  విజయవంతం అయిందని తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. జాతరకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. భక్తులకు చిన్న చిన్న అసౌకర్యాలు కలిగినందుకు చింతిస్తున్నామన్నారు. వీవీఐపీల తాకిడి వల్లే ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పుకొచ్చారు. సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లతో తమకు భావోద్వేగ బంధం ఉందని  మంత్రి సీతక్క ప్రస్తావించారు. 

Follow us on , &

ఇవీ చదవండి