Breaking News

బాబోయ్‌.. పులి!


Published on: 02 Feb 2026 12:02  IST

ఇప్పటి వరకు ఏలూరు జిల్లా ఏజెన్సీని వణికించిన పెద్దపులి ఇప్పుడు తూర్పుగోదావరిలోకి ప్రవేశించింది. ఆదివారం వేకువజామున రాజమహేంద్రవరం రూరల్‌ మండలం తొర్రేడు గ్రామంలో అరటి తోట సమీపంలో కట్టి ఉన్న పశువులపై దాడి చేసి చంపేసింది. పులి పాదముద్రలను బట్టి పులి వచ్చిందని గుర్తించి స్థానికులు తీవ్ర భయాందోళన చెందారు. డీఎ్‌ఫవో ప్రభాకరరావు కథనం ప్రకారం.. తొర్రేడులో పశువుల మందపై దాడి చేసి రెండు ఆవులను చంపి, దూడను లాక్కొని పోయింది.

Follow us on , &

ఇవీ చదవండి